ఈ ఆండ్రాయిడ్ వైరస్ మీ ఫోన్ ను పూర్తిగా లాక్ చేస్తుంది 2020
ఇటీవలి కాలంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లను లక్ష్యంగా చేసుకుని పలు మాల్ వేర్లు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం, బయట వాడుకలో ఉన్న 87% ఆండ్రాయిడ్ ఫోన్ లకు ఎప్పటికప్పుడు అప్ డేట్ లు లేకపోవడం వల్ల కనీసం ఒక భద్రతా లోపం ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత శక్తివంతమైన ఆండ్రాయిడ్ రాన్సమ్ వేర్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది మీ ఆపరేటింగ్ సిస్టమ్ ని పూర్తిగా లాక్ చేస్తుంది. మీరు ఎలాంటి ఫోన్ కాల్స్ చేయలేరు, టెక్ట్స్ సందేశాలను యాక్సెస్ చేసుకోలేరు. ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం కూడా సాధ్యం కాదు. మైక్రోసాఫ్ట్ కు చెందిన పరిశోధకులు ఆండ్రాయిడ్ఓఎస్/మాల్ లాకర్.బీ అనే ఈ రాన్సమ్ వేర్ ను కనుగొన్నారు. ఇంటర్నెట్, ఆన్ లైన్ ఫోరమ్ లు మొదలైన తృతీయపక్ష అప్లికేషన్ స్టోర్లు వంటి వివిధ ఛానల్స్ ద్వారా ఈ మాల్ వేర్ స్మార్ట్ ఫోన్ లోనికి ప్రవేశిస్తోంది. ఒకసారి ఫోన్ లోకి ప్రవేశించిన తర్వాత వెంటనే హాని చేయదు. యూజర్ మొదటిసారి హోమ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు, అది ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవుతుంది. అప్పుడు అది మొత్తం ఫోన్ ను పూర్తిగా లాక్ చేసి, దాని లోకి వెళ్లకుండా నే స్క్రీన్ మీద నకిలీ ఎన్ ఫోర్స్ మెంట్ అలర్ట్ ను చూపిస్తుంది. ఆ హెచ్చరిక విని...